కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి !! చూస్తే వావ్ అంటారు !! వీడియో
ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు...
ఇల్లు కొనాలనుకుంటున్నారా? సీఫ్రంట్ ఉన్న ఇల్లు చూపిస్తే ఓకేనా.. ఫుల్ ప్రైవసీ.. కనీసం కాకి కూడా వాలని లొకేషన్ అది. అవును.. దొంగలు కూడా చొరబడలేని ఇల్లు… పక్కింటోడి పోరు.. ట్రాఫిక్ హోరు.. జనాల జోరు లేని ప్రదేశంలో.. ఎంతో ఏకాంతంగా నిర్మించిన ఇల్లు. ఇలాంటి ఇంటి కోసం వెతుకుతున్నట్లైతే.. ఇదిగో.. ఇక్కడ చూపిస్తున్న హౌస్ మీకోసమే. పేరు స్పిట్‌బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక హాట్ టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వైరల్ వీడియోలు
Latest Videos