వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
పిట్టల దొర.. ఇలాంటివాళ్లను సినిమాల్లో తప్ప ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసి ఉండరు. పూర్వం ఎప్పుడో ఇలాంటివాళ్లు ఉండేవారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊరూరూ తిరుగుతూ పిట్ట కథలు చెప్తాడు. వినే వాడుంటే చాలు గంటలు గంటలు కట్టు కథలు చెబుతూనే ఉంటాడు. ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ పిట్టల దొరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతలు వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకుని కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తున్నారు.
పిట్టల దొర.. ఇలాంటివాళ్లను సినిమాల్లో తప్ప ప్రస్తుత కాలంలో ఎక్కడా చూసి ఉండరు. పూర్వం ఎప్పుడో ఇలాంటివాళ్లు ఉండేవారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊరూరూ తిరుగుతూ పిట్ట కథలు చెప్తాడు. వినే వాడుంటే చాలు గంటలు గంటలు కట్టు కథలు చెబుతూనే ఉంటాడు. ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ పిట్టల దొరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతలు వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకుని కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో పిట్టల దొర నాగరాజు అంటే తెలియని వారుండరు. తాత ముత్తాతలు నుంచి ఈ పిట్టలదొర వేషాన్ని వృత్తిగా తీసుకొని ఊరూరూ తిరుగుతూ అందరికీ ఏవేవో కథలు చెబుతూ వచ్చిన చిల్లరతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతను చెప్పే కథల్లో చరిత్ర దాగి ఉంటుంది. మన పూర్వీకుల సంప్రదాయాలు, ఆచారాలు కూడా పిట్టల దొర తన కథల్లో వినిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు. ఆధునిక కాలంలో ఇలాంటి ఎన్నో గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాతముత్తాతలనుంచి వచ్చిన కళను వారసత్వంగా తీసుకొని గత చరిత్రను తన కథలతో ప్రజలకు పరిచయం చేస్తున్న పిట్టల దొరను అందరూ అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

