భలే ఉందే ఈ బైక్.. ఎంచక్కా మడతపెట్టి మంచం కింద సర్దేయొచ్చు !!
నూతన ఆవిష్కరణలకు పెట్టింది పేరైన జపాన్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. ఈ బైక్ ను మడతపెట్టి సూట్ కేస్ మాదిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ల వచ్చు.
నూతన ఆవిష్కరణలకు పెట్టింది పేరైన జపాన్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించింది. ఈ బైక్ ను మడతపెట్టి సూట్ కేస్ మాదిరిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ల వచ్చు. జపాన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఐకోమా (Icoma) టాటామెల్ (Tatamel) పేరుతో ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన కన్‌న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో దీనిని ప్రదర్శించింది. దీని ప్రత్యేకత ఏంటంటే కొన్నిసెకన్లలోనే సూట్‌కేస్-పరిమాణంలో చతురస్రాకారంలో దీనిని మడిచి ఎంచక్కా తీసుకెళ్లి పోవచ్చు. ఈ బైక్ ధర 4వేల డాలర్లు.. అంటే దాదాపు 3,30,862 రూపాయలు. అత్యంత హై-ఎండ్ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ల శ్రేణిలో ఆ కంపెనీ దీనిని తీసుకొస్తోంది. వచ్చే ఏడాది చివరిలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దుబాయ్ పర్యాటక రంగంలో మరో అద్భుతం.. మూన్ వరల్డ్ రిసార్ట్స్ పేరుతో
మెడికల్ షాప్‌లో రెచ్చిపోయిన దుండగులు.. తుపాకులతో బెదిరించి..
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే
స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..
‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే