‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ లు ఎంతో ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా, అంతర్జాతీయంగా ఈ సినిమా మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ లు ఎంతో ఆసక్తిని కలిగించే విధంగా ఉంటాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా, అంతర్జాతీయంగా ఈ సినిమా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన పాతకాలం నాటి సినిమా క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు హాస్య నటులు లారెల్, హార్డీ అచ్చం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాదిరే రిథమ్ కలుపుతూ డ్యాన్స్ చేశారు. నాటు నాటు పాటను చూస్తే ఎవరూ ఆగలేరు.. అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. నెటిజన్లు అయితే ఈ వీడియో క్లిప్ ను ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా అకౌంట్ ను ఫాలో అవ్వడానికి ఇలాంటి ట్వీట్లు చాలు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘‘లారెల్, హార్డీ ఆర్ఆర్ఆర్ డ్యుయో మాదిరి ఎనర్జీ చూపించలేకపోవచ్చు. అలా అని వారేమీ చెత్తగా డ్యాన్స్ చేయలేదు’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘనంగా వివాహం.. బ్యాండ్ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!
గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్ !!
విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో