సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!

సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!

Phani CH

|

Updated on: Jan 25, 2023 | 9:40 AM

సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‏మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దృవీకరించిన సంగతి తెలిసిందే. ఇ

సుశాంత్ సింగ్ రాజ్‏పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‏మెంట్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దృవీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని పెంపుడు శునకం ఫడ్జ్ కూడా మరణించింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “ఫడ్జ్.. నువ్వు కూడా స్వర్గంలో ఉన్న నీ స్నేహితుడి దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మిమ్మల్ని అనుసరిస్తాం. అప్పటివరకు మాకు ఈ బాధ తప్పదు. గుండె ముక్కలయ్యింది” అంటూ భావోద్వేగ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఫడ్జ్ సుశాంత్ కలిసి ఉన్న పిక్ షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఈ నష్టం భరించలేనిది.. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఒదార్చేందుకు మాటలు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఫడ్జ్‏తో కలిసి సుశాంత్ సంతోషంగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్‌ !!

Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!

స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్‌ !! అసలు కథేంటంటే ??

కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!

కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్‌

Published on: Jan 25, 2023 09:40 AM