ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్ !!
వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు చెన్నై కస్టమ్స్ అధికారులు. తమిళనాడు ఎయిర్ పోర్టులో 45 బాల్ పైథాన్ స్నేక్‌లను అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.
వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు చెన్నై కస్టమ్స్ అధికారులు. తమిళనాడు ఎయిర్ పోర్టులో 45 బాల్ పైథాన్ స్నేక్‌లను అక్రమంగా తరలిస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. పైథాన్‌లతోపాటు 3 మార్మోసెట్‌లు, 3 స్టార్ తాబేళ్లు, 8 కార్న్ స్నేక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ వన్య ప్రాణులను బ్యాంకాక్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సామాను క్లెయిమ్ బెల్ట్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న రెండు బాక్స్‌లను అధికారులు తనిఖీ చేయగా .. అసలు విషయం బయట పడింది. జంతు నిర్బంధం, ధృవీకరణ సేవల విభాగం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. జంతువులను బ్యాంకాక్‌కు తిరిగి పంపించినట్లు చెన్నై కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. అయితే, నిందితుల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్ !! అసలు కథేంటంటే ??
కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!
కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్