ఘనంగా వివాహం.. బ్యాండ్‌ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!

ఘనంగా వివాహం.. బ్యాండ్‌ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Jan 25, 2023 | 10:19 AM

తమ పెంపుడు కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించారు వాటి యజమానులు. అంతేకాదు ఇరుగు పొరుగువాళ్లు, బంధువుల పెంపుడు కుక్కలను ఈ వివాహానికి ఆహ్వానించి మంచి విందుకూడా ఇచ్చారు.

తమ పెంపుడు కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించారు వాటి యజమానులు. అంతేకాదు ఇరుగు పొరుగువాళ్లు, బంధువుల పెంపుడు కుక్కలను ఈ వివాహానికి ఆహ్వానించి మంచి విందుకూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. టామీ అనే వరుడి శునకానికి, జెల్లీ అనే శునక వధువునిచ్చి జనవరి 14న వైభవంగా వివాహం జరిపించారు. అంతేకాదు, అట్రౌలీలోని తిక్రి రాయ్‌పూర్‌ నుంచి వరుడి శునకాన్ని తీసుకొని కుటుంబమంతా ఊరేగింపుగా అలీగఢ్‌లోని వధువు శునకం గ్రామం సుఖ్రావలికి చేరుకున్నారు. బ్యాండ్‌ మేళాలు, డీజే మోతలతో డాన్సులు చేసుకుంటూ మరీ వధువు ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఘనంగా పెద్దలందరి సమక్షంలో వివాహం జరిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్‌ !!

విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో

వాహనాలతో వెరైటీ రెస్టారెంట్‌.. వెళితే వాహ్వా అనాల్సిందే..

Published on: Jan 25, 2023 09:38 AM