Floods in Desert: ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
సహారా ఎడారిలో వరదలు.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సెప్టెంబర్ నెలలో ఒక రెండు రోజులు కురిసిన విపరీతమైన వర్షాలు మొరాకోలోని సహారా ఎడారిలో వరదలను సృష్టించాయి. ఎంతగా అంటే ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ‘ఇరికీ’ సరస్సులో నీళ్లు నిలిచాయి. ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కేవలం 2 రోజుల్లోనే కురవడం ఈ పరిస్థితికి దారితీసింది.
సహారా ఎడారిలో వరదలు.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సెప్టెంబర్ నెలలో ఒక రెండు రోజులు కురిసిన విపరీతమైన వర్షాలు మొరాకోలోని సహారా ఎడారిలో వరదలను సృష్టించాయి. ఎంతగా అంటే ఎడారిలో గత 50 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న ‘ఇరికీ’ సరస్సులో నీళ్లు నిలిచాయి. ఏడాది మొత్తంలో నమోదయ్యే వర్షపాతం కేవలం 2 రోజుల్లోనే కురవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఇరికీ సరస్సు జగోరా, టాటా ప్రాంతాల మధ్య ఉంది. గత 50 సంవత్సరాలుగా ఇది ఎండిపోయి ఉంది. భారీ వర్షాలతో నిండిపోయినట్టు నాసా ఉపగ్రహాల చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. ఈ సరస్సు మాత్రమే కాకుండా ఎడారిలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచాయి.
ఈ ఏడాది సెప్టెంబరులో కురిసినంత వర్షం కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ కురవలేదని మొరాకో ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా దేశ ఆగ్నేయ భాగంలో ఉన్న రబాత్ అనే గ్రామంలో ఒక రోజులోనే ఏకంగా 4 అంగుళాల మేర వర్షం కురిసిందని వివరించింది. మెర్జౌగా అనే గ్రామంలో కూడా భారీ వర్షపాతం నమోదైందని తెలిపింది. సాధారణంగా ఏడాది మొత్తం కలిపి 10 అంగుళాల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అలాంటిది ఇంత తక్కువ సమయంలో భారీ వర్షం నమోదవడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద ఎత్తున తరలివెళ్లి ఎడారిలో నీటిని చూస్తున్నారు. వరుసగా ఆరు సంవత్సరాల కరవు తర్వాత ఈ భారీ వర్షం పడిందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.