మరుగుదొడ్డి కోసం గుంత తవ్వుతున్న వ్యక్తి.. 2 మీటర్లు తవ్వగా కళ్లు జిగేల్ !!
ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది.
ఓ వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన కుమారుడితో కలిసి గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో రెండు మీటర్ల లోతువరకు తవ్వేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది. జాగ్రత్తగా దానిని పైకి తీసి చూసిన అతని కళ్లు జిగేల్ మన్నాయి. ఈక్రమంలో తవ్వడం కొనసాగించిన అతను ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే… కంబోడియా ప్రావిన్స్ వాయువ్య ప్రాంతంలోని కోర్క్‌వాట్ గ్రామానికి చెందిన బోయిన్ రాన్ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి మరగుదొడ్డి కట్టేందుకు గుంతలు తవ్వుతున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక నీలిరంగు రాయి కనిపించింది. దానిని తీసి శుభ్రపరిచి చూడగా అదొక పురాతన కాంస్య విగ్రహంగా గుర్తించారు. అలా ఇంకొంచం తవ్వగా మరో నాలుగు విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని తన ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుని శాంతిని కోరుతూ వాటి ముందు ధూపం వెలిగించాడు. అయితే ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అతని ఇంటికి చేరకున్న పోలీసులు ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత, విగ్రహాలను ప్రావిన్షియల్ మ్యూజియంలో ఉంచుతామని తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు 10 లేదా 11వ శతాబ్దానికి చెందిన థోబ్ బాఫున్ శైలిలో ఉన్నాయని ఒక పురావస్తు శాస్త్రవేత్త తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాలీడేస్‌లో విదేశాలకు వెళ్లిన ఫ్యామిలీ.. కట్ చేస్తే..
అసలు జాతిరత్నం మనోడే !! బోర్డు పరీక్షల్లో పాస్ చేయాలంటూ ??
రచ్చ లేపిన కండోమ్ యాడ్ !! అసలు విషయం తెలిస్తే షాక్ !!
సముద్రంలో చేపల కోసం వల వేస్తే ఊహించనిది చిక్కింది !!
ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

