రాత్రికి రాత్రి దొంగలు కట్టిన గుడి.. దేవుడుకూడా..

|

Dec 24, 2023 | 8:53 PM

పరమేశ్వరుడిని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే... ఆ ఊరిలో మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగవైభవంగా నిర్వహించే కల్యాణంలో, జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు.

పరమేశ్వరుడిని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే… ఆ ఊరిలో మాత్రం స్వామిని దొంగ మల్లన్నగా పిలుస్తారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగవైభవంగా నిర్వహించే కల్యాణంలో, జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అదీ ఒక్క రాత్రిలో నిర్మించారని కథ. వెయ్యి సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం, మల్లన్నపేట గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవుల్ని దొంగిలించారట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. కాసేపటికి విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించినా ఆవుల రంగు మారిపోవడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారట. దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్కరాత్రిలోనే తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రౌండ్‌లో గోల్ప్‌ ఆడుకుంటున్న వ్యక్తి.. రెండు పాములు పెనవేసుకొని గ్రౌండ్‌లోకి ఎంట్రీ !!

మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నారా.. ఇదిగో మీ సమస్యకు సింపుల్‌ పరిష్కారం

Prabhas’ Salaar : సలార్ పై.. వాళ్ల కుట్ర ప్లాప్ అంటూ పోస్టులు..

ఆసియాలోనే టాలీవుడ్‌ నుంచి ఒకే ఒక్కడు.. దటీజ్ NTR క్రేజ్‌

డంకీ పని డమాల్ దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

 

Follow us on