Viral: బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని షాక్.!

Viral: బీడీ ముట్టించుకొని అగ్గిపుల్ల కిందపడేశాడు.. క్షణాల్లో ఊహించని షాక్.!

Anil kumar poka

|

Updated on: Aug 24, 2024 | 4:54 PM

అనంతపురం కళ్యాణదుర్గంలో పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి ఓ షాపు ముందు నిలబడి మరో వ్యక్తితో పిచ్చాపాటి మాట్లాడుతూ బీడీ వెలిగించుకున్నాడు. అనంతరం అగ్గపుల్లను కింద పడేయగానే భగ్గున మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న బైకుకి కూడా అంటుకున్నాయి. ఇద్దరు వ్యక్తలూ అలర్టయ్యారు.. బైకును అక్కడ్నుంచి పక్కకు తీస్కెళ్లి పడేశారు. ఇంతలో ఆ ప్రాంతంలో మరింతగా మంటలు చెలరేగాయి.

అనంతపురం కళ్యాణదుర్గంలో పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి ఓ షాపు ముందు నిలబడి మరో వ్యక్తితో పిచ్చాపాటి మాట్లాడుతూ బీడీ వెలిగించుకున్నాడు. అనంతరం అగ్గపుల్లను కింద పడేయగానే భగ్గున మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న బైకుకి కూడా అంటుకున్నాయి. ఇద్దరు వ్యక్తలూ అలర్టయ్యారు.. బైకును అక్కడ్నుంచి పక్కకు తీస్కెళ్లి పడేశారు. ఇంతలో ఆ ప్రాంతంలో మరింతగా మంటలు చెలరేగాయి. కళ్యాణదుర్గం పాత బస్టాండ్‌ వద్ద పెట్రోలు బంక్‌నుంచి ఓ వ్యక్తి ఐదు లీటర్ల పెట్రోలు తీసుకొని వెళ్తుండగా పొరపాటున పెట్రోలు క్యాన్‌ కిందపడి పగిలిపోయింది. దాంతో పెట్రోలు రోడ్డుపక్కన షాపుల ముందుగా ప్రవహిస్తూ వెళ్లింది. అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు అవి నీళ్లు అనుకున్నారో ఏమో.. వారిలో ఓ వ్యక్తి బీడి వెలిగించి అగ్గిపుల్ల కిందపడేశాడు. వెంటనే మంటలు అంటుకున్నాయి. కొందరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. ఇంతలో అప్రమత్తమైన స్థానికులు, దుకాణ యజమానులు నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.