Platform Ticket Price: తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.!

|

Jun 27, 2024 | 5:32 PM

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్‌ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్‌ ఫారం టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్‌ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకోనవసరం లేదు.

భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. త్వరలో రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ఇది ప్రయాణికులకు ఉపశమనం కలిగించనుంది. ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధరను తగ్గించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్‌ లోనికి వెళ్లాలంటే ఎవరైనా సరే ప్లాట్‌ ఫారం టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రైలు ప్రయాణానికి వెళ్లేవారు టిక్కెట్‌ తీసుకుంటారు కాబట్టి వారు ప్రత్యేకంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకోనవసరం లేదు. అయితే ఎవరినైనా రైలు నుంచి రిసీవ్‌ చేసుకునేందుకు రైల్వే స్టేషన్‌ లోపలకి వెళ్లేవారు తప్పనిసరిగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ప్లాట్‌ఫారం టిక్కెట్ లేకుండా ఎవరైనా స్టేషన్‌లోపలికి ప్రవేశిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్లాట్‌ఫారం టిక్కెట్ కూడా రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చే ​మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ప్లాట్‌ఫారం టికెట్ ధర రూ.10. అయితే జూన్ 22న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్లాట్‌ఫారం టిక్కెట్లపై జీఎస్టీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్లాట్‌ఫారం టికెట్‌తో పాటు రిటైరింగ్ రూమ్, బ్యాటరీతో నడిచే కారు ఇతర సేవల రుసుము నుంచి కూడా జీఎస్టీని తొలగించారు. దీంతో ఇప్పటి వరకూ 5 శాతం ఉన్న జీఎస్టీ భారం ‍ప్రయాణికులకు తగ్గనుంది. ఫలితంగా ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర రూ. 10 నుంచి రూ. 9కి చేరనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.