Viral: వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!

వర్షాకాలం వచ్చేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటే గొడుగు తప్పనిసరి. ఒక్కోసారి మార్కెట్‌నుంచి ఏవైనా తెచ్చుకునేటప్పుడు రెండు చేతుల్లో సంచులుంటాయి.. ఆ సమయంలో వర్షం పడితే గొడుగు పట్టుకోవడం కష్టమవుతుంది. ఇటు గొడుగును, చేతిలోని బ్యాగులు లేదా ఇతర సామాన్లను బ్యాలెన్స్‌ చేయడం కష్టమవుతుంది. అలాంటి సందర్భం ఎదురైన ఓ కుర్రాడు సూపర్‌ ఐడియా వేశాడు.

Viral: వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!

|

Updated on: Jun 27, 2024 | 5:05 PM

వర్షాకాలం వచ్చేసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటే గొడుగు తప్పనిసరి. ఒక్కోసారి మార్కెట్‌నుంచి ఏవైనా తెచ్చుకునేటప్పుడు రెండు చేతుల్లో సంచులుంటాయి.. ఆ సమయంలో వర్షం పడితే గొడుగు పట్టుకోవడం కష్టమవుతుంది. ఇటు గొడుగును, చేతిలోని బ్యాగులు లేదా ఇతర సామాన్లను బ్యాలెన్స్‌ చేయడం కష్టమవుతుంది. అలాంటి సందర్భం ఎదురైన ఓ కుర్రాడు సూపర్‌ ఐడియా వేశాడు. వర్షంలో చెండు చేతులతో సామాన్లు పట్టుకున్నా మరోవైపు గొడుగు వేసుకొని హ్యాపీగా నడిచి వెళ్లిపోయాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వాట్‌ ఏన్‌ ఐడియా సర్‌ జీ .. అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడంటే..

వర్షం పడుతున్నప్పుడు రెండు చేతుల్లో ఏవైనా వస్తువులు ఉంటే గొడుగును పట్టుకోవడం అసాధ్యం కదూ.. అందుకే ఓ కుర్రాడు గొడుగును వీపుకు ధరించేలా ఓ సెటప్‌ చేశాడు. ఇందుకోసం మనం బీరువాల్లో చొక్కాలను వేయడానికి ఉపయోగించే రెండు హ్యాంగర్స్‌ను తీసుకున్నాడు. ఈ రెండింటినీ గొడుగు కర్రకు రెండు వైపులా పెట్టి ప్లాస్టర్స్‌తో చుట్టేశాడు. ఆ తర్వాత రెండు హ్యాంగర్లను రెండు చేతులకు, బ్యాక్‌పాక్‌ బ్యాగ్‌ వేసుకున్నట్లు వేసుకున్నాడు. దీంతో అసలు చేతుల అవసరం లేకుండానే ఎంచక్కా వర్షంలో గొడుగుతో బయటకు వెళ్లాడు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ధరించగలిగే గొడుగుల’ తయారీకి సంబంధించి ఇది ఒక మంచి ఐడియాగా భావించాలి అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us