వారెవ్వా.. బుర్రుపిట్టలు తుర్రు మనేలా.. రైతు వినూత్న ఆలోచన

|

Jun 06, 2024 | 3:17 PM

రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాలి. పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకూ రేయింబవళ్లు కంటికి రెప్పలా సంరక్షించాలి. వేలకు వేలు పోసిన రైతు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను.. ఒక వైపు అతివృష్టి, అనావృష్టి, చీడ పీడలు.. పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి. మరోవైపు ఆ పంటకు జంతువులు, పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలి పోటులా మారుతుంటాయి.

రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాలి. పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకూ రేయింబవళ్లు కంటికి రెప్పలా సంరక్షించాలి. వేలకు వేలు పోసిన రైతు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను.. ఒక వైపు అతివృష్టి, అనావృష్టి, చీడ పీడలు.. పంట దిగుబడిపై ప్రభావం చూపుతాయి. మరోవైపు ఆ పంటకు జంతువులు, పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలి పోటులా మారుతుంటాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఎవరికి తోచిన విధంగా వారు పంట సంరక్షణ కోసం పలు పద్ధతులు అవలంభిస్తుంటారు. కొందరు కోతుల బెడదనుంచి రక్షించుకోడానికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేలా మైకులు ఏర్పాటు చేస్తే ఇంకొందరు పక్షుల బెడద లేకుండా పాలిథిన్ కవర్లు పంటపై ఉంచి కాపాడుకుంటున్నారు. పంటల సాగుకు వాతావరణంతో పాటు జంతువులు, పక్షుల నుంచి బెడద తప్పడం లేదు. వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండినా అవి చేతికందే వరకూ గ్యారంటీ ఉండటంలేదు. పంటలను జంతువులు, పశువులు, పక్షుల నుంచి కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారుతోంది. ఈ క్రమంలో పంటలను రక్షించుకునేందుకు రైతులు తమ మెదడుకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ పక్షులు, జంతువులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఏజేన్సీ ప్రాంతానికి చెందిన రైతులు వినూత్న ఆలోచనలతో జొన్న పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో కొందరు జొన్న పంటను సాగు చేస్తున్నారు. అయితే ఉదయం, సాయంత్రం సమయంలో పక్షులు, కోతులు, ఇతర జీవులు పంట చేనుపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో రైతులు జొన్న కంకుల వద్ద పాలిథిన్ కవర్లు కట్టి కాపాడుకుంటున్నారు. ఈ కవర్లు ఏర్పాటు చేయడం వల్ల అవి గాలికి ఊగుతూ ఓ రకమైన శబ్దం వస్తుంది. ఈ శబ్ధానికి పక్షులు అక్కడ ఏదో ఉందని భావించి భయంతో జొన్న పంట వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇందుకోసం పెద్ద ఖర్చు లేకపోవడం, పాలిథిన్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభించే అవకాశం ఉండడంతో రైతులు ఈ పద్ధతిలో పంటను పక్షుల నుంచి కాపాడుకొంటున్నారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శునకానికి అరుదైన గుండె ఆపరేషన్‌ నిర్వహించిన ఢిల్లీ పశువైద్య నిపుణులు

సరస్సు నుంచి బయటపడ్డ ఇనుప పెట్టె !! తెరిచి చూడగ దెబ్బకి మైండ్ బ్లాక్

వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

వడదెబ్బకు గురైన వానరానికి ఓఆర్ ఎస్.. మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల ప్రశంసలు

 

Follow us on