Viral: ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే.! వీడియో.
పిల్లలు ఆటల్లో మునిగి పోతే... అమ్మ గుర్తుండదు.. ఇల్లూ గుర్తుండదు.. తీరా ఇంటికి వెళ్దామనుకునే సరికి బాగా ఆలస్యమైపోవడంతో అమ్మ కొడుతుందేమోనని భయపడి.. ఇంటికి వెళ్లినా అమ్మకు కనిపించకుండా ఎక్కడో దాక్కుంటారు. అలాంటి ఘటనే జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ముగ్గురు పిల్లలు ఆటల్లో మునిగిపోయి ఇంటికి వెళ్లడం మర్చిపోయారు. రాత్రయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆ ఊరు మొత్తం గగ్గోలెత్తిపోయారు. పిల్లలకోసం వెతికీ వెతికీ ఆచూకీ తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ప్రసాద్, కావ్య, నాగశ్రీ ముగ్గురు చిన్నారులు ఆరవ తరగతి చదువుతున్నారు..నిన్న స్కూలుకు వెళ్లి సాయంత్రం సమయంలో బడి నుండి ఇంటికి బయలుదేరారు, మార్గ మధ్యలో ఆడుకుంటూ ఆడుకుంటూ.. ఆటలో మునిగిపోయి ఇంటికి వెళ్లాలనే విషయాన్ని మర్చిపోయారు. అప్పటికే రాత్రి అయిపోవడంతో ఆ సమయంలో ఇంటికి వెళితే పేరెంట్స్ కొడతారని భయపడి సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చెట్ల పొదల్లో అక్కడే నిద్రపోయారు. పిల్లలు రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెంది గ్రామంలోని పెద్దలకు సమాచారం అందించారు.
ఊరు అంతా ఏకమై అన్ని చోట్ల గాలించారు. ఎంతకీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారుల కోసం రాత్రంతా వెతికిన ఆచూకీ లభించలేదు. ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా మిస్ అవ్వడంతో ఊరంతా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయాన్నే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని ఆరబెట్టేందుకు వెళ్లిన రైతుకి ఆ బస్తాల పక్కన చెట్ల పొదల్లో ఆదమరిచి నిద్రపోతున్న పిల్లలు కనిపించారు. ఆ దృశ్యం చూసిన రైతు ఆనందానికి అవదులు లేవు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని పిల్లలను చూసి ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి అంతా ఊరిని ఉరుకులు పరుగులు పెట్టించిన చిన్నారులు చివరకు సురక్షితంగా దొరకడంతో ఊరంతా హమ్మయ్యా అంటూ ఊపిరి పిల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.