Manyam: కలెక్టర్‌కే షాకిచ్చిన కూరగాయల వ్యాపారి..ఏం చేశాడంటే.? వీడియో

|

Mar 20, 2024 | 5:43 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. రైతు తెలిపిన నిరసనకు ఇటు జిల్లావాసులు, అటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. నిత్యం ఏదో చోట పంట పొలాలు, రైతుల ఆస్తులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. రైతు తెలిపిన నిరసనకు ఇటు జిల్లావాసులు, అటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు రెచ్చిపోతుంది. నిత్యం ఏదో చోట పంట పొలాలు, రైతుల ఆస్తులు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. మన్యం జిల్లాలో ప్రధానంగా కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం మండలాల్లో ఏనుగుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంట్లో నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏనుగుల గుంపు మరోసారి కొమరాడ మండలం గారవలస సమీపంలో రెచ్చిపోయాయి. గారవలస గ్రామానికి చెందిన వెంకట నాయుడు అనే రైతు తన పంట పొలాల్లో కూరగాయలు పండిస్తుంటాడు. అలా పండించిన కూరగాయలను సమీపంలోని పార్వతీపురం పట్టణానికి సైకిల్ పై తీసుకెళ్లి అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. బస్సుల్లో కానీ, ఆటోలో కానీ కూరగాయలు తీసుకెళ్తే తనకు వచ్చే ఆదాయం ఆ చార్జీలకే సరిపోతుందనే ఉద్దేశ్యంతో ప్రతిరోజు సైకిల్ పైనే కూరగాయలు అమ్ముతుంటాడు.

ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే ఉదయాన్నే తన స్వగ్రామం నుండి కూరగాయలు సైకిల్ పై తీసుకొని పార్వతీపురం పట్టణానికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి ఏనుగుల గుంపు సడన్ గా పంట పొలాల్లో నుండి రోడ్డు పైకి వచ్చింది. అప్పుడే అటుగా వస్తున్న వెంకటనాయుడును చూసిన ఏనుగుల గుంపు ఒక్కసారిగా అతడి పై దాడి చేసేందుకు ప్రయత్నించింది. పరిస్థితి గమనించిన వెంకట నాయుడు సైకిల్ ను రోడ్డు పైనే వదిలేసి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఏనుగులు సైకిల్, కూరగాయలను ధ్వంసం చేశాయి. అది చూసి రైతు రగిలిపోయాడు. ఎలాగైనా సరే తనకు జరిగిన అన్యాయం పై అధికారులను నిలదీయాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే ధ్వంసమైన తన సైకిల్ ను భుజాన వేసుకొని సుమారు 15 కిలోమీటర్లు నడిచి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడ కలెక్టర్ ని కలిసి తన సైకిల్ చూపించి మీ వల్ల నాకు నష్టం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు మాటలకు షాకైన కలెక్టర్‌ ఏం జరిగిందని అడిగారు. దాంతో.. మీరు ఏనుగులను కట్టడి చేయకపోవడం వల్లే ఈ రోజు నా జీవనోపాధిని కోల్పోవల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ జరిగిన విషయం చెప్పాడు. తనకు న్యాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో పరిస్థితి అర్థం చేసుకున్న కలెక్టర్ నిషాంత్, వెంకట్ నాయుడుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చి, తక్షణమే వెంకటనాయుడును ఆదుకోవాలని అధికారులను ఆదేశించాడు. జరిగిన వ్యవహారం తెలుసుకున్న వెంకట్ జిల్లావాసులు వెంకటనాయుడు చేసిన పనికి శభాష్ అని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on