130 సం.ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల !!
అమెరికాలో ఆండ్రూ క్లార్క్, కరోలిన్ క్లార్క్ దంపతులకు ఇప్పటికే ఒక మగబిడ్డ ఉన్నాడు. ఇటీవల ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సారి అమ్మాయి పుట్టింది.
అమెరికాలో ఆండ్రూ క్లార్క్, కరోలిన్ క్లార్క్ దంపతులకు ఇప్పటికే ఒక మగబిడ్డ ఉన్నాడు. ఇటీవల ఈ దంపతులు తమ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సారి అమ్మాయి పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. అమ్మాయి పుడితే ఆశ్చర్యం ఎందుకు అని అనుకుంటున్నారు కదూ..! ఎందుకంటే.. దాదాపు 130 ఏండ్ల నుంచి ఆండ్రూ కుటుంబంలో అమ్మాయే పుట్టలేదట. అందుకే ఆండ్రూ కుటుంబం కూడా అమ్మాయి పుట్టగానే ఆశ్చర్యపోయింది. అండ్రూ ఫ్యామిలీపై గుడ్ మార్నింగ్ అమెరికా కథనం ప్రచురించింది. 1885 తర్వాత ఆండ్రూ కుటుంబంలో ఆడబిడ్డ పుట్టడం ఇదే తొలిసారి. అమ్మాయి పుట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆండ్రూ చెప్పుకొచ్చాడు. పదేళ్ల క్రితం తను ఆండ్రూతో డేటింగ్ చేసినప్పుడు చాలా కాలంగా తమ కుటుంబంలో ఆడపిల్ల లేదని చెప్పాడని, అప్పుడు తను నమ్మలేదని, ఈ విషయం గురించి ఆండ్రూ తల్లిదండ్రులను అడిగి నిజం తెలుసుకున్నానని కరోలిన్ చెప్పుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై మహిళ డ్యాన్స్ !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో
కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

