కోపంలో ఫోన్ మింగేసిన యువతి !! చివరికి ఏమైందంటే ??
మధ్యప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ.. చివరికి ఆస్పత్రికి చేరేలా చేసింది. అందుకు ఓ సెల్‌ఫోనే కారణం. ఇటీవల చిన్నపిల్లలనుంచి పెద్దలవరకూ అందరూ సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్ అయిపోయారు.
మధ్యప్రదేశ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ.. చివరికి ఆస్పత్రికి చేరేలా చేసింది. అందుకు ఓ సెల్‌ఫోనే కారణం. ఇటీవల చిన్నపిల్లలనుంచి పెద్దలవరకూ అందరూ సెల్‌ఫోన్‌కు ఎడిక్ట్ అయిపోయారు. మొబైల్ లేనిదే క్షణం కూడా గడపలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్కోసారి తీవ్రఅనర్థాలకు దారితీస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బింద్ జిల్లాకు చెందిన ఓ 18 ఏండ్ల యువతి సెల్‌ఫోన్ కోసం తన సోదరుడితో గొడవ పడింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఆ అమ్మాయి సెల్‌ఫోన్‌ను మింగేసింది. కాసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితురాలిని గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితురాలికి సీటీ స్కాన్, ఎక్స్ రే నిర్వహించి, ఆమె కడుపులో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. రెండు గంటల పాటు యువతికి శస్త్ర చికిత్సచేసి, సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. దీంతో ఆమెకు 10 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.5 వేలతో బైక్‌పైనే రెండు దేశాలు చుట్టేసిన కేరళ యువకుడు !! యువకుడి పట్టదలకు శభాష్ అనాల్సిందే
హనుమాన్ చాలీసా పఠిస్తూ కర్రసాము !! కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!
స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

