ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!
అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తెలివి మీరిపోయారు. సరికొత్త మార్గాల్లో యధేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు.
అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తెలివి మీరిపోయారు. సరికొత్త మార్గాల్లో యధేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏప్రిల్ 3వ తేదీన అబుదాబీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు 6E-1412 నెంబర్‌తో ఓ విమానం వచ్చింది. రోజూ మాదిరిగానే ఆ సమయంలోనూ కస్టమ్స్ అధికారులు తమ తనిఖీలు నిర్వహించారు. ఆ ఫ్లైట్‌లో నుంచి దిగిన ప్రయాణీకుల్లో ఓ వ్యక్తిపై వారికి అనుమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులను చూడగానే అతడు కూడా కాస్త తడబడ్డాడు. అంతే దొరికిపోయాడు. ఆ వ్యక్తి తత్తరపాటును చూసి అనుమానంతో అతన్ని ప్రశ్నించారు కస్టమ్స్ అధికారులు. అతను పొంతలేని సమాధానాలు చెప్పడంతో అతని బ్యాగ్ చెక్ చేసారు. అందులో ఓ ఎలక్ట్రిక్ మోటారు లాంటిది కనిపించింది. దాన్ని పగలకొట్టి చూడగా.. అందులో 1.7 కిలోల బంగారం బయటపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మార్ట్ ఫోన్‌కి ఎడిక్ట్ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

