Organs Donate: దాతృత్వం చాటుకున్న కుటుంబం.. ఇది కదా మానవత్వం..!

|

Feb 07, 2024 | 8:24 PM

కర్నూలులో ఓ కుటుంబం దాతృత్వం చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన కూతురు అవయవాలు దానం చేశారు కుటుంబ సభ్యులు. కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు నగరానికి చెందిన వివాహిత పావని లత బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు డాక్టర్లు. ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా నర్సారావు పల్లెకు చెందిన శ్రీనివాస రెడ్డితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. మూడేళ్ల క్రితం భర్త కిడ్నీ వ్యాధితో చనిపోయారు.

కర్నూలులో ఓ కుటుంబం దాతృత్వం చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన కూతురు అవయవాలు దానం చేశారు కుటుంబ సభ్యులు. కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న కర్నూలు నగరానికి చెందిన వివాహిత పావని లత బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు డాక్టర్లు. ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా నర్సారావు పల్లెకు చెందిన శ్రీనివాస రెడ్డితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. మూడేళ్ల క్రితం భర్త కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఇప్పుడు.. పావని లత బ్రెయిన్ డెడ్ కావడంతో.. కిడ్నీలు, కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్ దానం చేసి గొప్ప మనస్సు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. ఒక కిడ్నీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, మరో కిడ్నీని కర్నూలు కిమ్స్‌కు ఇచ్చారు. లంగ్స్‌ను హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌కు, లివర్‌ను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌కు, కళ్లను కర్నూల్ రెడ్ క్రాస్‌కు ఇచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా అవయవదాన కార్యక్రమం జరిగిందన్నారు డాక్టర్లు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని చోట్లకు ఆర్గాన్స్ తరలించారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..