క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. బ్యాంక్‌కే షాకిచ్చే ప్రయత్నం
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో గుర్తు..
శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాంక్ అకౌంట్‌కు 44వేల రూపాయలు జమ చేశాడు. మొత్తం 88 రూ.500 నోట్లు ఉన్నాయి.. ఇవి ఫేక్‌గా నిర్ధారణ కావడంతో మెషిన్‌లో ఓ పక్కన ఉన్నాయి. ఈ నెల 3న బ్యాంకు సిబ్బంది ఈ డిపాజిట్ మెషీన్ తెరవగా.. అందులో నకిలీ నోట్లు చూసి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని మెనేజర్‌కు చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. ఆ తర్వాత టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఈ డబ్బులు ఎవరివ, ఎవరి బ్యాంకు అకౌంట్‌లోకి జమ అయ్యాయో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత క్లారిటీ వస్తుందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రేజీ డ్యాన్స్‌తో హోరెత్తించిన పోలీస్ అధికారి !! నెట్టింట వైరల్
మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..
వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం
Araku Valley: వేసవిలోనూ మంత్రముగ్ధులను చేస్తున్న అరకు అందాలు
కుక్క ముందు యువకుడు నాగినీ డ్యాన్స్ !! లోకల్ మద్యం మాయ అంటున్న నెటిజన్లు