పోన్లే పాపం అని ఫోన్‌ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా

|

Aug 23, 2024 | 11:14 PM

సైబర్ మోసాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏ రకంగా అవకాశం ఉంటే.. ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా రోజుకో రకంగా సైబర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త టెక్నిక్స్‌తో అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలు, పిన్‌ నెంబర్లు తెలుసుకుని మోసం చేయడం, మెసేజ్‌ల రూపంలో లింకులు పంపి

సైబర్ మోసాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏ రకంగా అవకాశం ఉంటే.. ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా రోజుకో రకంగా సైబర్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త టెక్నిక్స్‌తో అమాయకుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గతంలో ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలు, పిన్‌ నెంబర్లు తెలుసుకుని మోసం చేయడం, మెసేజ్‌ల రూపంలో లింకులు పంపి బ్యాంక్‌ ఖాతాల నుంచి సొమ్ము లూఠీ చేసిన సంఘటనలు చూశాం. కానీ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మాత్రం అంతకు మించి అన్న రీతిలో ఓ వ్యాపారి ఖాతా నుంచి సొమ్ము కొల్లగొట్టాడు కేటుగాడు. బియ్యం ధర చెప్పుతానని వ్యాపారీ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని అవతలి వ్యక్తితో మట్లాడి, ఫోన్‌ వ్యాపారి చేతికిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే వ్యాపారీ బ్యాంక్‌ ఖాతా నుంచి 99 వేల రూపాయలు కట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది. దీంతో లబోదిబో మంటూ పోలీస్‌లను ఆశ్రయించాడు ఆ వ్యాపారి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం

“టాడ్‌పోల్‌ వాటర్‌”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా

విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??

పని మనిషిలా వస్తుంది.. ఇల్లంతా దోచేస్తుంది

క్యాంప్‌ పేరుతో మైనర్ బాలికలపై లైంగిక దాడి