Young Woman: ఏంటమ్మా ఈ టాలెంట్.. యువతి చేసే ఎక్సర్‌సైజ్‌ వేరే లెవల్‌.. చూస్తే మతిపోవాల్సిందే..!

Updated on: Dec 22, 2022 | 9:45 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అనేకమంది రకరకాల స్టంట్స్‌, ఎక్సర్‌సైజెస్‌కి సంబంధించిన వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. అయితే

తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో మాత్రం వేరే లెవల్‌ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ వీడియోలో ఓ యువతి చేసే ఎక్సర్‌సైజ్‌ చూస్తే మతి పోవాల్సిందే. ఆమె ట్యాలెంట్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఓ కుర్చీలో తలక్రిందులుగా నిలబడింది. తర్వాత తన కాళ్లపైన రెండు బంతులు, చేతులతో మరో మూడు బంతులు పట్టుకొని ఎంతో సునాయాసంగా వ్యాయామం చేస్తుంది. ముందుగా రెండు బంతులు కాళ్లపై బౌన్స్ అవుతాయి. మరో మూడు బంతులు చేతిలోకి తీసుకున్న తర్వాత యువతి నిజంగానే మ్యాజిక్‌ చేసినట్టుగానే చేసింది. ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. వామ్మో అలా చేయడానికి ఎన్నాళ్లు ప్రాక్టీస్‌ చేసావ్‌ తల్లీ అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ విపరీతంగా లైక్‌ చేస్తున్నారు. యువతిపై ప్రశంసల కామెంట్లు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Published on: Dec 22, 2022 09:45 AM
Follow Us