Gold Royal Enfield: నీబైకు బంగారంగానూ.. సైలెన్సర్ సహా అంతా గోల్డే..! వీడియో వైరల్..
సాధారణంగా బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. మహిళలైతే ఇక చెప్పనక్కర్లేదు. బంగారు నగలపైన వారికుండే మక్కువ అంతా ఇంతా కాదు. అయితే ఈ బంగారంపై మక్కువ ఒక్క స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే గోల్డ్ అంటే వారికి పిచ్చి అని చెప్పవచ్చు.
భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న క్రేజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ బైకులను యువకుల దగ్గర నుంచి పెద్ద వారి వరకు చాలా మంది ఇష్టపడతారు. అయితే కొంత మంది ఈ బైక్ ప్రేమికులు వారికి కావలసిన రీతిలో మోడిఫై చేసుకుంటారు. మహారాష్ట్ర పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ‘సన్నీ వాఘురే’ అనే వ్యక్తికి బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను గోల్డెన్ బుల్లెట్‌గా మార్చేసుకున్నాడు. టర్న్ ఇండికేటర్స్, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ కవర్, ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ కలరే. ఇక ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మ ఉంది. ఇది కూడా గోల్డ్ కలర్‌లోనే ఉంది. గోల్డెన్ బుల్లెట్ రైడ్ చేసే వ్యక్తి కూడా బైకుకి తగిన విధంగా బంగారు ఉంగరాలు, బ్రాస్‌లెట్, వాచ్ ధరించాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులోనే ఉంది. ఈ వీడియో రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ గోల్డెన్ బుల్లెట్ నెట్టింట దూసుకుపోతోంది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...