పెళ్లి వేడుకలో అనుకోని అతిథి… క్షణాల్లో కలకలం వీడియో
పెళ్లి ఓ అందమైన వేడుక.. మనదేశంలో పెళ్ళికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. పెళ్లిళ్లకు భారీ ఏర్పాట్లు చేస్తారు.. బంధువులు భారీగా తరలి వస్తారు. ఇక పెళ్ళిలో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. పాటలు, డ్యాన్స్ లు బంధువుల కబుర్లు నానా హంగామా ఉంటుంది. అయితే బంధువులతోపాటు ఓ వివాహ వేడుకకు ఓ అనుకోని అతిథి వచ్చింది. దాన్ని చూడగానే అతిథులు అంతా భయంతో పరుగులు తీశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ వివాహం జరుగుతోంది. బంధుమిత్రులతో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. ఎప్పుడు వచ్చిందో, ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందోకానీ ఓ చిరుతపులి అక్కడికి వచ్చింది. నేనూ అతిథినే అన్నట్టుగా ఓ చోట కూర్చుని చక్కగా పెళ్లి తంతును చూస్తూ ఉంది. మొత్తానికి ఎవరో ఈ చిరుతను గమనించారు. దెబ్బకు కేకలు పెట్టడంతో ఆ ప్రాంగణమంతా క్షణాల్లో గందరగోళంగా మారిపోయింది. అతిథులంతా తలో దిక్కూ పరిగెత్తారు. కొందరు అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో వారు పశువైద్యులను వెంటపెట్టుకొని ఘటనాస్థలికి చేరుకున్నారు. పశువైద్యుల సహాయంతో అటవీ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి చిరుతను బంధించి తీసుకెళ్లారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.