నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయిన ఏనుగులు !! హృదయాన్ని కదిలిస్తున్న దృశ్యం..
వన్యప్రాణులు ఆహారం, నీటికోసం చాలా దూరం ప్రయాణిస్తాయి. వాటిలో ముఖ్యంగా ఏనుగులు ప్రధానమైవిగా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ రెండు ఏనుగులు నీటికోసం వెతుక్కుంటూ వెళ్లి బురదలో చిక్కుకుపోయాయి.
వన్యప్రాణులు ఆహారం, నీటికోసం చాలా దూరం ప్రయాణిస్తాయి. వాటిలో ముఖ్యంగా ఏనుగులు ప్రధానమైవిగా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ రెండు ఏనుగులు నీటికోసం వెతుక్కుంటూ వెళ్లి బురదలో చిక్కుకుపోయాయి. తమ దుస్థితినుంచి బయటపడేందుకు ఆ మూగజీవులు కష్టపడిన తీరు నెటిజన్లను కలిచివేస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కెన్యాలో ఓ రెండు ఏనుగులు నీటికోసం వెళ్లి బురదలో కూరుకుపోయాయి. ఆ బురదనుంచి బయటపడలేక రెండు రోజులపాటు అందులోనే ఉన్నాయి. ఎట్టకేలకు రెస్క్యూటీం గుర్తించి వాటిని సురక్షింతంగా కాపాడింది. KWS మరియు వైల్డ్‌లైఫ్ వర్క్స్ సంయుక్త ఆపరేషన్ ద్వారా రెండు ఆడ ఏనుగులను రక్షించగలిగామని అధికారులు చెప్పారు. ఈ వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘ఈ రెండు ఆడ ఏనుగులకు దాహమే మరణ ఉచ్చుగా మారింది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కరువు సమయంలో ఇది సర్వసాధారణమైన పరిస్థితి..నీటి కోసం ఏనుగులు అడవిలో అన్వేషిస్తూ.. పలు సందర్బాల్లో ఎండిపోతున్న ఆనకట్టలలోకి ప్రవేశించి బురదలో కూరుకుపోతాయి. మెత్తటి మట్టితో నిండిన గుంతలు, బురదతో కప్పబడిన లోతైన ప్రదేశాల్లో ఏనుగులు పడిపోతుంటాయి. అవి తమను తాము రక్షించుకోలేవు..ఇది నిజంగానే ఏనుగులకు ప్రాణాంతక పరిస్థితి అవుతుంది. బురదలో కూరుకుపోయిన ఏనుగును రక్షించిన వారి ప్రయత్నాలను, కష్టాలను నెటిజన్లు ప్రశంసించారు. మీరు చేసిన పనికి చాలా కృతజ్ఞతలు.. మీరు భూమిపై దేవదూతలు అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రమం తప్పకుండా స్కూలుకి వెళ్తున్న కొండముచ్చు.. 100 % అటెండెన్స్ !!
కండక్టర్‌ను ఉతికారేసిన పాసింజర్.. ఎందుకో తెలుసా ??
సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే..
గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న కుక్క.. సాయం చేసిన పిల్లి..
రైల్లో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణికుడు !!