Viral Video: ఏనుగు మంచి మనసు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

|

Aug 25, 2022 | 7:55 PM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో ఏనుగులకు సంబంధించినవి కూడా ఉంటాయి.

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో ఏనుగులకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఏనుగులు కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో చైనాలో జరిగిన సంఘటనగా తెలుస్తోంది. చైనాలోని ఓ జూలో ఓ ఏనుగు ఉంది. దానిని సందర్శకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఆ సమయంలో ఓ బాలుడి కాలుకి ఉన్న చెప్పు పడిపోయింది. దాంతో పిల్లవాడు చెప్పు కోసం ఏడుస్తుంటాడు. అయితే చెప్పు కిందపడటం గమనించిన ఏనుగు.. దాన్ని తొండంతో ఎంతో జాగ్రత్తగా తీసి, బాలుడికి అందించింది. దాంతో హ్యాపీ ఫీలయిన బాలుడు ఏనుగుకి కృతజ్ఞతగా గడ్డి తినిపిస్తాడు. దాన్ని ఏనుగు.. ఎంతో ప్రేమతో తీసుకుని తింటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే

బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్

Published on: Aug 25, 2022 07:55 PM