చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే
మనచేతిలోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగితే ఎలా ఉంటుంది.. ఊహించడానికే భయంగా ఉంది కదా.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో సెల్‌ఫోన్ రిపేర్ చేస్తున్న ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
మనచేతిలోని సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగితే ఎలా ఉంటుంది.. ఊహించడానికే భయంగా ఉంది కదా.. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో సెల్‌ఫోన్ రిపేర్ చేస్తున్న ఓ యువకుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. షాప్‌కి వచ్చిన ఓ కస్టమర్‌తో మాట్లాడుతూ సెల్‌ఫోన్ రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా సెల్‌ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. పెద్ద శబ్దంతోపాటు మంటలు కూడా ఎగసిపడ్డాయి. దీంతో రిపేర్ చేస్తున్న యువకుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఫోన్‌ను కిందపడేసి మంటలను ఆర్పివేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ పేలడాన్ని దగ్గర నుంచి చూసిన కస్టమర్ దెబ్బకు అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన ఆ వ్యక్తి మంటలు చెలరేగగానే ఫోన్ పక్కకు విసిరేయడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పాడు. రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పేలిందని వివరించాడు. కాగా సెల్‌ఫోన్ ఉబ్బినట్టు కనిపించగానే రిపేర్ షాప్‌కు తీసుకెళ్లాలని బంటీ సూచించాడు. లేదంటే తనకు జరిగినట్టే చేతుల్లో సెల్‌ఫోన్లు పేలతాయని హెచ్చరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

