Elephant Attack: నా అడ్డాలోకే వస్తారా.. ఎంత ధైర్యం..? అంటూ రెచ్చిపోయిన గజరాజు.. తృటిలో తప్పించుకున్న జనం.. (వీడియో)

Elephant Attack: నా అడ్డాలోకే వస్తారా.. ఎంత ధైర్యం..? అంటూ రెచ్చిపోయిన గజరాజు.. తృటిలో తప్పించుకున్న జనం.. (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 07, 2021 | 2:55 PM

సరదాగా ఫ్యామిలీతో కలిసి పార్క్‌లకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులు, పక్షులను చూసి చిన్నా పెద్దా అంతా ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. కొందరు వాటికి దూరంగా నిలబడి ఫోటోలు దిగుతారు. కొందరు సఫారీలో వెళ్లి జంతువులను దగ్గరగా చూడాలనుకుంటారు.

సరదాగా ఫ్యామిలీతో కలిసి పార్క్‌లకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులు, పక్షులను చూసి చిన్నా పెద్దా అంతా ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. కొందరు వాటికి దూరంగా నిలబడి ఫోటోలు దిగుతారు. కొందరు సఫారీలో వెళ్లి జంతువులను దగ్గరగా చూడాలనుకుంటారు. అలా ప్రత్యక్షంగా జంతువులను చూడాలనుకున్న కొందరికి అనుకోని సంఘటన ఎదురైంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.


సఫారీలో జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తేడా కొడితే మాత్రం ఇలా గుండెకాయ నోట్లోకి జారినట్లు కూడా ఉంటుంది. అలాంటి ఘటనే శ్రీలంకలోని యాలా నేషనల్‌ పార్కులో జరిగింది. కొంతమంది వ్యక్తులు జీప్‌లో అలా జంతువులను చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో జీప్‌పై అడవి ఏనుగు ఒకటి దాడి చేయడానికి ప్రయత్నించింది. ‘ఇది నా అడ్డా.. ఇక్కడికి రావడానికి మీకెంత ధైర్యం?’ అనేలా వారిపై విరుచుకుపడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించిన ఫోటోగ్రాఫర్‌ సెర్గీ తెలిపారు. సియనా ఇంటర్నేషనల్‌ ఫోటో పురస్కారాల్లో జర్నీస్‌ అండ్‌ అడ్వంచర్స్‌ కేటగిరీలో ఈ చిత్రం మెదటి బహుమతిని గెలుచుకోవడం విశేషం.

మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Rashmika Mandanna: పూలగౌనులో వయ్యారాలు వలకబోస్తున్న ‘రష్మిక మందన్న’.. (ఫొటోస్)