viral video: లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి.. వీడియో

|

Oct 14, 2021 | 9:56 AM

ప్రేమకు కులం, మతం, వయస్సుతో సంబంధం లేదంటారు. అవును నిజమే ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఓ జంట నిరూపించారు. లేట్ వయస్సులో ప్రేమలో పడ్డారు వారు.

ప్రేమకు కులం, మతం, వయస్సుతో సంబంధం లేదంటారు. అవును నిజమే ప్రేమకు వయస్సు అడ్డు కాదని ఓ జంట నిరూపించారు. లేట్ వయస్సులో ప్రేమలో పడ్డారు వారు. కరోనా మహమ్మారి సమయంలో జిమ్ ఆడమ్స్, ఆడ్రీ కౌట్స్ డేటింగ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో కలుసుకున్నారు. ఎనిమిది నెలల ప్రేమ తర్వాత ఈ జంట సెప్టెంబర్ 25 న వివాహం చేసుకున్నారుయ. వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఇవి కాస్త వైరలయ్యాయి. పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్ పెళ్లైన 38 సంవత్సరాల తర్వాత 2017 సంవత్సరంలో తన భార్యను కోల్పోయారు. కొవిడ్ సమయంలో 78 ఏళ్ల ఆడమ్స్ 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో చేరారు. అక్కడ అతను 79 ఏళ్ల రిటైర్డ్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఆడ్రీని కలిశాడు. ఆమె 33 సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: చంద్రుడిపై నడిచే బైక్‌.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో

Viral News: వధువుకు వరుడి ఊహించని కానుక.. ఏకంగా 60 కేజీల బంగారంతో..