Jacqueline Fernandez: జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ రూ.7 కోట్ల.. దోపిడీ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు..

Jacqueline Fernandez: జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ రూ.7 కోట్ల.. దోపిడీ కేసులో భాగంగా ఈడీ దర్యాప్తు..

Anil kumar poka

|

Updated on: May 07, 2022 | 7:14 PM

మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్‌ ఇచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ దోపిడీ కేసు దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌కు చెందిన 7.27కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.


మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్‌ ఇచ్చింది. ఆర్థిక నేరస్థుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ దోపిడీ కేసు దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌కు చెందిన 7.27కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. ఇందులో 7 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లేనని తెలుస్తోంది.దాదాపు 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్‌ ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వీటిలో ఖరీదైన డిజైనర్‌ బ్యాగులు, జిమ్‌ సూట్లు, వజ్రాల చెవిదిద్దులు, బ్రాస్‌లెట్‌, మినీ కూపర్‌ వంటి 5.7 కోట్ల విలువైన కానుకలు జాక్వెలిన్‌, ఆమె కుటుంబసభ్యులకు సుకేశ్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. దీంతో ఈ కేసులో విచారణ నిమిత్తం నటికి నోటీసులు జారీ చేయగా.. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుకేశ్‌తో జాక్వెలిన్‌కు సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..

Published on: May 07, 2022 07:14 PM