East Godavari: ఇంటి ఆవరణలో పెంచిన ద్రాక్ష చెట్టుక విపరీతంగా కాపు

East Godavari: ఇంటి ఆవరణలో పెంచిన ద్రాక్ష చెట్టుక విపరీతంగా కాపు

Pvv Satyanarayana

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2023 | 6:13 PM

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామారెడ్డి దంపతులు పెరట్లో ద్రాక్ష పాదు పెట్టి 15 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరంలో ఎక్కువ నెలలు ద్రాక్ష కాస్తూనే ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాల్లో అరుదుగా కాసే ఈ ద్రాక్ష పెరట్లో విరివిగా కాయడంతో చూసేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారు.

ద్రాక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.  ద్రాక్షలో పోషకాలు ఎక్కువే. అదీ నల్ల ద్రాక్ష.. తియ్య తియ్యగా.. పుల్ల పుల్లగా భలే ఉంటుంది. అలాంటి ద్రాక్ష పెరట్లోనే గుత్తులు గుత్తులుగా కాస్తుంటే ఆ ఆనందం వర్ణించగలమా. అనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో కొప్పవరం అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ ఇంటి పెరట్లోనే ద్రాక్ష చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాపు వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామారెడ్డి దంపతులు పెరట్లో ద్రాక్ష పాదు పెట్టి 15 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరంలో ఎక్కువ నెలలు ద్రాక్ష కాస్తూనే ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాల్లో అరుదుగా కాసే ఈ ద్రాక్ష పెరట్లో విరివిగా కాయడంతో చూసేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తూ ఉంటారు. ఇంటి యజమాని భార్య సత్యవేణి ద్రాక్ష పాదుకు పోషణ అందిస్తూ.. ఎక్కవ కాపు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దంపతులు ఇంటికి వచ్చే బంధుమిత్రులకు ముందు తమ ఇంటి ద్రాక్షతో నోటి తీపి చేసి సంగతులు తెలుసుకుంటూ ఉంటారు. తెలిసినవారికి ఇంటికి ద్రాక్షను పార్శిల్ చేసి పంపుతూ ఆనందపడుతున్నారు ఈ దంపతులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 05, 2023 06:12 PM