ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??

ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??

Phani CH

|

Updated on: Nov 05, 2023 | 9:45 PM

ఉపిరితిత్తుల్లో సూది దిగిపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ బాలుడిని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు వినూత్న వైద్య విధానంతో కాపాడారు. ఆయస్కాంతంతో సూదిని వెలికి తీసి చిన్నారిని రక్షించారు. నవంబర్‌ 1న జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను వైద్యులు తాజాగా వెల్లడించారు. నాలుగు సెంటీమీటర్ల పొడవున్న సూది అతడి ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిందని వెల్లడించారు. బాలుడికి సంప్రదాయిక విధానంలో ఆపరేషన్ చేస్తే ప్రమాదమని గుర్తించిన డాక్టర్లు ప్రత్యామ్నాయ పద్ధతిని అవలంభించారు.

ఉపిరితిత్తుల్లో సూది దిగిపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరిన ఓ బాలుడిని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు వినూత్న వైద్య విధానంతో కాపాడారు. ఆయస్కాంతంతో సూదిని వెలికి తీసి చిన్నారిని రక్షించారు. నవంబర్‌ 1న జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను వైద్యులు తాజాగా వెల్లడించారు. నాలుగు సెంటీమీటర్ల పొడవున్న సూది అతడి ఊపిరితిత్తుల్లో గుచ్చుకుపోయిందని వెల్లడించారు. బాలుడికి సంప్రదాయిక విధానంలో ఆపరేషన్ చేస్తే ప్రమాదమని గుర్తించిన డాక్టర్లు ప్రత్యామ్నాయ పద్ధతిని అవలంభించారు. దీనికోసం అప్పటికప్పుడు ఓ ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓ అయస్కాంతం తెప్పించి ఆ పరికరానికి అమర్చి సూది ఉన్న భాగం సమీపానికి ఆ పరికరాన్ని చొప్పించి సూదిని బయటకు రప్పించినట్టు వివరించారు. ఈ ప్రయోగం ఫలితం ఇస్తుందా? లేదా? కొంత సందేహం కలిగిందనీ, కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా తమ ప్రయత్నం ఫలించిందని వైద్యులు వెల్లడించారు. ఎండోస్కోపీ ద్వారా ఈ మొత్తం ప్రక్రియను నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..

బస్సు బీభత్స ఘటనలో ఒకరు దుర్మరణం.. కారు, బైకులు ధ్వంసం