ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!
ఇకపై ప్రియురాలిని చుంభించేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు మరి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలో ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను పదినిమిషాలపాటు ముద్దుపెట్టుకున్నాడు. అంతే, అతడి కర్ణభేరి పగిలిపోయింది. ఫలితంగా చెవులు వినిపించడం మానేశాయి. ఈ మేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. ఆగస్టు 22న చైనా వేలంటైన్స్ డే నాడు ఈ ఘటన జరిగినట్టు పత్రిక కథనంలో పేర్కొంది.
ఇకపై ప్రియురాలిని చుంభించేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు మరి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలో ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను పదినిమిషాలపాటు ముద్దుపెట్టుకున్నాడు. అంతే, అతడి కర్ణభేరి పగిలిపోయింది. ఫలితంగా చెవులు వినిపించడం మానేశాయి. ఈ మేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. ఆగస్టు 22న చైనా వేలంటైన్స్ డే నాడు ఈ ఘటన జరిగినట్టు పత్రిక కథనంలో పేర్కొంది. తూర్పు ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్‌లేక్‌లో ఓ జంట ముద్దుల మైకంలో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయింది. సరిగ్గా పది నిమిషాల తర్వాత కుర్రాడు విలవిల్లాడిపోయాడు. ఎడమ చెవిలో నొప్పిగా ఉందని, చెవి నుంచి పెద్ద శబ్దం వస్తోందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి కర్ణభేరి పగిలిపోయినట్టు గుర్తించారు. కోలుకునేందుకు రెండు నెలలు పడుతుందని తీరిగ్గా సెలవిచ్చారు. ఉద్వేగభరితమైన అదర చుంబనం చెవి లోపల గాలి పీడనంలో వేగంగా మార్పులకు కారణమవుతుందని, ఈ కేసులో అదే జరిగిందని వైద్యులు వివరించారు. భాగస్వామి భారీ శ్వాసతో కలిసి కర్ణభేరి పగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. సో.. ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త సుమీ!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్ చూసి ఏడ్చేసిన విజయ్
Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

