Viral Video: చెవులు కుట్టే వేడుకలో మేనమామల హంగామా.. చూసి ఆశ్చర్యపోయిన జనం. వీడియో వైరల్.
హిందూ సంప్రదాయంలో చిన్నారులకు చెవులు కుట్టించడం ఓ వేడుక. కొందరు మగపిల్లలు, ఆడ పిల్లలకు కూడా చెవిపోగులు కుట్టిస్తారు. అది కూడా మేనమామలు దగ్గరుండి సోదరి పిల్లలకు ఈ వేడుక జరిపించడం సంప్రదాయం. అలా తన మేనల్లుడు, మేనకోడలికి చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు
తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా మంగాడు గ్రామానికి చెందిన ఇళయరాజా-నవనీత దంపతులకు ఇద్దరు పిల్లలు. మేనకోడలు రిక్షణ, మేనల్లుడు సుధీక్షన్‌ల చెవులు కుట్టించేందుకు మేనమామలు సిద్ధమయ్యారు. మంగాడు గ్రామంలోని ముత్తుమారియమ్మన్ ఆలయ సమీపం లోని ఫంక్షన్ హాల్ లో వేదకి ఏర్పాటు చేశారు . ఈ పండుగ సందర్బంగా మేనమాలు నవీన్ సుందర్, నవశీలన్‌లు చేసిన హుంగామ చూసి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. చిన్నారులను ఎడ్లబండ్లలో ఊరేగిస్తూ, పదులసంఖ్యలో మహిళలు రకరకాల పళ్లు, పూలు, స్వీట్లు సారెగా తీసుకెళ్లారు. అంతేకాదు, బంగారం, వెండి, నగదు ఇలా రకరకాల కానుకలతో ఘనంగా వేడుకల్ని నిర్వహించారు. ఇక ఈ వేడుకకు చుట్టు పక్కల గ్రామాలనుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తిన్నవారికి తిన్నంత అన్నట్టుగా నాన్ వెజ్ వంటలతో భారీ విందు ఏర్పాటు చేసారు. ఇక వచ్చిన వారు చదివించిన చదివింపులు కూడా లక్షలల్లోనే రావడం తో ఈ వార్త ఇప్పుడు తమిళనాడు లో వైరల్ గా మారింది. మేనమామలు అంటే ఇలా ఉండాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...