Duck eat Snake: పామును అమాంతం మింగిన బాతు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ వీడియో..!
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటే.. మరికొన్ని ఆసక్తి కలిగిస్తుంటాయి. మరికొన్ని నవ్వుల పువ్వులు పూయిస్తుంటాయి.
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటే.. మరికొన్ని ఆసక్తి కలిగిస్తుంటాయి. మరికొన్ని నవ్వుల పువ్వులు పూయిస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఇంకా వైరల్ అవుతుంటాయి. తాజాగా పామును బాతు అమాంతం మింగేసిన వీడియో వైరల్‌గా మారింది. ఓ చిన్న బాతు పిల్ల కాలువ ఒడ్డున పచ్చ గడ్డిలో పురుగులు, కీటకాల కోసం వెతుకుతుంది. అప్పుడే ఆ బాతుకు ఓ ప్రమాదకరమైన పాము కనిపించింది. వెంటనే పామును బాతు నోటితో ఒడిసిపట్టి.. కొద్ది కొద్దిగా చూస్తుండగానే అమాంతం మింగేసింది. పాము బాతుబారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Dec 31, 2022 09:14 AM
