1400 Prostitutions: వామ్మో.. మామూలు దందా కాదు.. 14వందల మందితో హైటెక్ వ్యభిచారం..!
తెలంగాణ పోలీసులు భారీ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్ చేసి 1,419 మంది బాధితులకు విముక్తి కల్పించారు. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. కాగా ఈ డ్రగ్స్, సెక్స్ రాకెట్‌లో ఆర్నవ్, సమీర్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపుల్లో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్.. 39 కేసుల్లో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 1,419 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్‌సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్..
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
'వయసు' పెరిగింది.. 'మనసు' మారింది!
నరహంతక బంటి..ఎట్టకేలకు చిక్కింది

