తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ‘ఎంత అద్భుతంగా ఉందో’ అంటూ ఆశ్చర్యపోతారు.ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో ఎనిమిదో వింతను సృష్టించాడు. 1000-1700 గొర్రెల మంద కదలికలను.. అవి మార్చుకుంటున్న దిశలను పైనుంచి(టాప్ యాంగిల్) డ్రోన్ కెమెరా సహాయంతో బంధించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికలను ఫాస్ట్ ఫార్వర్డ్.. స్లో మోషన్ యాంగిల్స్‌లో చూపించగా.. అవి ఒకసారి పాములా.. మరోసారి పక్షి ఆకారంలో కనిపించి అబ్బురపరుస్తున్నాయి. డ్రోన్ కెమెరాతో చేసిన ఈ అద్భుతం వీక్షకులను కనువిందు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వీడియో తీయడం వెనుక ఏడు నెలల కఠోర శ్రమ ఉందని ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: 10 కోడి గుడ్లను మింగి కక్కిన భారీ పాము..అల ఎలా అంటూ వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు :Snake Viral Video.
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.