బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా

|

Jun 28, 2022 | 9:48 AM

బుల్డోజర్లను ఇళ్ళు కూలగొట్టడానికి, గుంతలు పూడ్చడానికే కాదు పెళ్ళి ఊరేగింపులో కూడా ఉపయోగించొచ్చని నిరూపించాలనుకున్నాడో ఏమో ఓ వరుడు.. కల్యాణమండపానికి దానిపై ఊరేగింపుగా వెళ్ళి ఆశ్చర్యపరిచాడు.

బుల్డోజర్లను ఇళ్ళు కూలగొట్టడానికి, గుంతలు పూడ్చడానికే కాదు పెళ్ళి ఊరేగింపులో కూడా ఉపయోగించొచ్చని నిరూపించాలనుకున్నాడో ఏమో ఓ వరుడు.. కల్యాణమండపానికి దానిపై ఊరేగింపుగా వెళ్ళి ఆశ్చర్యపరిచాడు. ఊరేగింపును వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అయింది. ఇంకేముంది విషయం కాస్తా పోలీసుల చెవిలో పడింది. దీంతో వరుడుని వాహనంలో ఎక్కించుకున్నందుకుగాను బుల్డోజర్‌ డ్రైవర్‌కు పోలీసులు జరిమానా విధించారు. మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లా కెర్పానికి చెందిన అంకుష్‌ జైస్వాల్‌ టీసీఎస్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 21న అతని వివాహం అయింది. అయితే పెళ్ళి ఊరేగింపు కొంచె డిఫరెంట్‌గా ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. దీంతో వివాహ వేదిక వద్దకు వెళ్లడానికి ఓ బుల్డోజర్‌ను మాట్లాడుకున్నాడు. దాని బ్లేడ్‌పై కూర్చుని ఊరేగింపుగా ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నాడు. ఈ వ్యవహారం పోలీసుల చెవిలో పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??

వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం

ఈ కారుకి పెట్రోలు, డీజిల్‌ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం

పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!

 

Published on: Jun 28, 2022 09:48 AM