ముంబైని హడలెత్తిస్తున్న చిరుతలు .. వీడియో వైరల్
ముంబై పరిసర ప్రాంతాలను చిరుతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొల్హాపూర్‌లో ఓ చిరుతను బంధించే క్రమంలో ఉత్కంఠ నెలకొంది. ఓ పోలీస్ అధికారిపై చిరుత దాడి చేయగా, ఆయన స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. వలతో చాకచక్యంగా చిరుతను బంధించి బోనులోకి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
ముంబై పరిసర ప్రాంతాల్లో చిరుతల బెడద ప్రజలను కలవరపెడుతోంది. ఇటీవల నాసిక్‌లో ఒక చిరుతను పట్టుకోగా, తాజాగా కొల్హాపూర్‌లో మరో చిరుతను చాకచక్యంగా బంధించారు. కొల్హాపూర్ నగరంలోని వివేకానంద ప్రాంతంలో ఓ మహిళకు ఇంట్లో చిరుత కనిపించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఊహించని మలుపులు తిరిగింది. ఇంటి పక్కనున్న చెట్టుపై దాక్కున్న చిరుత అకస్మాత్తుగా పోలీసులపై దూకింది. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారిపై దాడి చేయగా, తన వద్ద ఉన్న లాఠీతో ఎదుర్కునే ప్రయత్నంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం చిరుత సమీపంలోని పాడుబడ్డ మురుగు కాలువలో దాక్కుంది. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వలతో చుట్టుముట్టి చిరుతను బంధించడానికి ప్రయత్నించారు.
మరిన్ని వీడియోల కోసం :