Dragon-Turtle: తాబేలుపై డ్రాగన్ ఎటాక్.. తాబేలు కప్పరంలో దూరి నమిలేసిన వైనం.. వణుకు పుట్టిస్తున్న వీడియో
డ్రాగన్ పేరు వినే ఉంటారుగా.. ఇది భూమ్మీద జీవించే బల్లి జాతికి చెందిన భయంకరమైన అతి పెద్ద జంతువు. ఇది దాదాపు 90 కేజీల బరువు వరకూ పెరుగుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన విషపు జంతువు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొమొడో డ్రాగన్ బీచ్‌లో నడుస్తూ వెళ్తుంది. అక్కడ దానికి ఓ పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే దానిపై ఎటాక్ చేసింది. తాబేలు భయంతో దాని రక్షణ కవచం డొప్పలోకి చొచ్చుకుపోయినా వదల్లేదు. డ్రాగన్ తన తలను తాబేలు డొప్పలోకి దూర్చి లోపలే దాన్ని ఆహారంగా చేసుకుంది. ఈ క్రమంలో తాబేలు డొప్పను డ్రాగన్ తలకు హెల్మెట్‌లా తగిలించుకుని తన రాజసాన్ని ప్రకటిస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్లింది. ఆహారం పూర్తయిన తర్వాత తాబేలు డొప్పను విదిల్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. 2019లో తీసిన ఈ పాత వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ మరోసారి పోస్ట్ చేయడంతో తాజాగా మళ్లీ వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. వేలాదిమంది లైక్‌చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుందంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
