Chicken: అరుదైన దృశ్యం మిస్ కావొద్దు.. అద్భుతం అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు. వైరల్ వీడియో.
సాధారణంగా జంతువులకు నాలుగు కాళ్లు ఉండటం సహజం. మరి పక్షులకు, మనుషులకు రెండే కాళ్లుంటాయి. అలాగే పక్షిజాతికి చెందిన కోడికి కూడా రెండే కాళ్లు ఉంటాయి. కానీ..
సాధారణంగా జంతువులకు నాలుగు కాళ్లు ఉండటం సహజం. మరి పక్షులకు, మనుషులకు రెండే కాళ్లుంటాయి. అలాగే పక్షిజాతికి చెందిన కోడికి కూడా రెండే కాళ్లు ఉంటాయి. కానీ ఈ కోడికి మాత్రం నాలుగు కాళ్లు. అవును.. మీరు విన్నది నిజమే. ఇంతవరకూ మనం రెండు కాళ్ల కోళ్లనే చూశాం. ఇకపైన నాలుగు కాళ్ల కోళ్లను కూడా చూస్తామేమో.. ఏమో కాదు.. ఇప్పుడే చూద్దాం. ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఇటీవలే పుట్టిన ఈ కోడి పిల్లను ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఇప్పుడా వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన చేతులతో నాలుగు కాళ్లతో ఉన్నకోడిపిల్లను చూపిస్తున్నాడు. సాధారణంగా ఇలా పుట్టిన కోడిపిల్లలు ఎక్కువ కాలం బ్రతకవు. కానీ, ఈ కోడిపిల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఆ వ్యక్తి కోడిపిల్ల తల్లి కోడితో సహా ఇతర కోళ్లను కూడా వీడియోలో చూపించాడు. పైగా అతడు, ఈ కోడిపిల్ల పెద్దయ్యాక వీడియో తీసి మళ్లీ చూపిస్తానని కూడా చెప్పాడు. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు నాలుగు కాళ్ల కోడిపిల్ల అనే టైటిల్ పెట్టారు. ఈ వీడియోపై చాలా మంది స్పందించారు. వందల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. అందరూ అద్భుతం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
