Donald Trump: కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో..

|

Jul 22, 2024 | 5:36 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్‌ ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యారు. తాజాగా జరిగిన బహిరంగ సభలో ట్రంప్‌ అతడిని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు. హత్యాయత్నం తర్వాత మొదటిసారి ట్రంప్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్‌ ప్రాణాలు కోల్పోయారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో దుండగుడి తూటాకు బలయ్యారు. తాజాగా జరిగిన బహిరంగ సభలో ట్రంప్‌ అతడిని గుర్తుచేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు. హత్యాయత్నం తర్వాత మొదటిసారి ట్రంప్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేదికపై ఓ మేనిక్విన్‌కు కోరీ యూనిఫాం, హెల్మెట్‌ను పెట్టి ఉంచారు. ఆ బొమ్మ వద్దకు వెళ్లిన ట్రంప్‌ దానికి ముద్దు పెట్టారు. ఈ సందర్భంగా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు మానవ కవచంగా మారి నిస్వార్థంగా తన ప్రాణాలు కోల్పోయారు అని కొనియాడారు. అనంతరం అక్కడివారితో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు.

కాల్పుల్లో గాయపడిన వారి గురించి ట్రంప్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతవారం పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై 20 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి ఓ తూటా దూసుకెళ్లింది. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే స్పందించి ఆయన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on