Gym Trainer: జిమ్ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
ఆరోగ్యంగా ఉండటం కోసం అందరికీ వ్యాయామం అవసరం. కొందరు ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే కొందరు జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటారు. అక్కడ ప్రత్యేకమైన ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తారు. తాజాగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువకుడిపై జిమ్ ట్రైనర్ దాడికి పాల్పడ్డాడు. ఓ చెక్కతో బలంగా ఆ యువకుడి తలపై కొట్టాడు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరోగ్యంగా ఉండటం కోసం అందరికీ వ్యాయామం అవసరం. కొందరు ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే కొందరు జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తుంటారు. అక్కడ ప్రత్యేకమైన ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తారు. తాజాగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువకుడిపై జిమ్ ట్రైనర్ దాడికి పాల్పడ్డాడు. ఓ చెక్కతో బలంగా ఆ యువకుడి తలపై కొట్టాడు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిమ్ ట్రైనర్ దాడి దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల యోగేష్ షిండే గత రెండేళ్లుగా ములుండ్ ఈస్ట్‌లోని జిమ్‌కు వెళ్తున్నాడు. బుధవారం జిమ్‌లో ఒక ట్రైనర్ సహాయంతో అతడు వ్యాయామాలు చేస్తున్నాడు. కాగా, జిమ్‌లో ఒక పక్కన నిల్చుని ఉన్న మరో ట్రైనర్ ఉన్నట్టుండి వ్యాయామాల కోసం వినియోగించే ఉడెన్ క్లబ్‌ను తీసుకొని యోగేష్ షిండే వద్దకు వెళ్లి అతడి తలపై దానితో కొట్టాడు. అక్కడున్న వారు ఆ ట్రైనర్‌ను అడ్డుకున్నారు. యోగేష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా అతడి పుర్రె ఎడమ వైపున రెండు పగుళ్లు ఏర్పడినట్లు వైద్య పరీక్షలో తేలింది. మరోవైపు దాడి చేసిన జిమ్ ట్రైనర్ నాకెల్‌పై పోలీసులకు యోగేష్ ఫిర్యాదు చేశాడు. ఆ ట్రైనర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దాడికి ముందు అతడి వైపు చూశానని పోలీసులకు చెప్పాడు. వ్యాయామాలు తప్పుగా చేస్తున్నానా? అని కూడా అడిగానని, సమాధానం ఇవ్వని అతడు అకస్మాత్తుగా తనపై దాడి చేసినట్లు ఆరోపించాడు. కాగా, యోగేష్ జోక్ చేయడంతో ఆగ్రహించిన ట్రైనర్ అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ ట్రైనర్ నాకెల్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

