యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
మూగజీవులు తమకు ఆశ్రయం ఇచ్చిన వారికి పట్టాడ అన్నం పెట్టి కడుపు నింపిన వారి కోసం ప్రాణాలను పణంగా పడతాయి. ఇది నిజమైనదని చెప్పే ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. మీరట్ లో కల్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లో అమెరికన్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క మినీ ఉంది. అయితే మే రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు విషపూరిత పాము ఒకటి కల్లు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లోని వారంతా గాఢనిద్రలో ఉన్నారు.
పామును పసుకు గట్టిన వరండాలోని మినీ కొద్దిసేపు మొరిగి ఇంటి యజమానికి సిగ్నల్ ఇచ్చింది. వారు వచ్చేలోపు పామును ఇంట్లోకి వెళ్ళనియ్యకుండా మినీ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆ పాము మినీని అనేక చోట్ల కరిచి గాయపరిచింది. కుక్క మొరిగే శబ్దం విని బయటకు వచ్చేసరికి కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. అది నోట్లో పామును కాలనియ్యకుండా పట్టుకుంది. వెంటనే కల్లు పామును బంధించి జనవాసాలకు దూరంగా విడిచిపెట్టాడు. అనంతరం మినీని ఆస్పత్రికి తీసుకెళ్ళగా దాని బాడీపై ఏకంగా 26 పాముకాటు గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందించినప్పటికి పాముకాటు కారణంగా 27 గంటలు ప్రాణాలతో పోరాడి మినీ మృతి చెందింది. మినీని కాటు వేసిన పాము రస్సెల్స్ వైపర్ అని యజమాని తెలిపాడు. ఇది అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము విషాన్ని విడుదల చేస్తుంది. దాని కాటు తర్వాత రక్తం గడ్డకట్టి గంట లోపే మరణం సంభవిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో
రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో
వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
