నా పులుల్ని కాపాడండి ప్లీజ్‌.. జాగ్వర్‌ కుమార్‌ విన్నపం..(Video)

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Oct 07, 2022 | 9:09 AM

ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అక్కడ నుంచి పొరుగు దేశానికి..ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా లక్షల మంది పౌరులు యుద్ధ క్షేత్రాన్ని వీడిపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అక్కడ నుంచి పొరుగు దేశానికి వెళ్లిపోయిన ఓ ఆంధ్రా డాక్టర్‌.. తన పెంపుడు పులులను రక్షించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ గిరి కుమార్‌ పాటిల్ ఉక్రెయిన్‌లోని సెవెరోదొనెట్స్క్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో పనిచేసేవారు. కీవ్‌లోని జంతు ప్రదర్శనశాల నుంచి ‘యశా’ అనే జాగ్వర్‌ హైబ్రిడ్‌ చిరుతపులితో పాటు ‘సబ్రినా’ అనే ఫాంథర్‌ నల్లటి చిరుతను గత రెండేళ్లుగా పెంచుకుంటున్నారు. అంతరించిపోతున్న పులులు జాతులను కాపాడే ప్రయత్నమని చెప్పే ఆ వైద్యుడిని జాగ్వర్‌ కుమార్‌గా పిలిచేవారు. అయితే, రష్యా దాడుల్లో పాటిల్‌ పనిచేస్తున్న ఆస్పత్రి నాశనం కావడంతోపాటు.. ఆ ప్రాంతాన్ని పుతిన్‌ సేనలు ఆక్రమించుకున్నాయి. పాటిల్‌కు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. పెంపుడు పులుల పోషణ కష్టతరమైంది. దీంతో వాటిని లుహాన్స్క్‌లోని స్థానిక రైతు వద్ద వదిలిపెట్టి పోలాండ్‌కు వెళ్లిపోయాడు.. ఇంకా మరింత సమాచారం కోసం ఈ వీడియో చూసేయండి..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu