Love at 91 years age: 91 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డ డీఎల్‌ఎఫ్ అధినేత.!
లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్టింది. అదీ కూడా 91 ఏళ్ల వయసులో.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ అధినేత కేపీ సింగ్ ప్రేమలో పడ్డారు. ఆయన తన భాగస్వామి వివరాలను
లేటు వయసులో ఘాటు ప్రేమ పుట్టింది. అదీ కూడా 91 ఏళ్ల వయసులో.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ అధినేత కేపీ సింగ్ ప్రేమలో పడ్డారు. ఆయన తన భాగస్వామి వివరాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భార్య ఇందిర మరణం తర్వాత ఒంటరి వాడైన తనకు ఓ తోడు దొరికిందని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ ప్రకటించారు. 65 ఏళ్ల బంధం తర్వాత భాగస్వామిని కోల్పోతే.. గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేమన్నారు. జీవితంలో మనిషికి ఓ భాగస్వామి ఎంత ముఖ్యమో గ్రహించానన్నారు. తన కొత్త స్నేహితురాలి విశేషాలను ఆయన ఓ మీడియా ఛానల్‌తో పంచుకొన్నారు.
2018లో ఆమె మరణం తర్వాత దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో జీవించినట్లు సింగ్ తెలిపారు. భార్య మరణం తర్వాత నుంచి కంపెనీ యాజమాన్యంలో చురుకైన పాత్ర నుంచి వైదొలుగుతున్నట్లు సింగ్ చెప్పారు. ప్రేమించిన వారు దూరం కావడం, 91 ఏళ్ల వయసు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతామన్నారు. కంపెనీ కోసం పనిచేసే సమయంలో పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యమని భావించినట్లు వివరించారు. కానీ, బాధల్లో ఉండటంతో పూర్తి సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది.. అందుకే తాను యాజమాన్యం నుంచి దూరమైనట్లు సింగ్ తెలిపారు. తన కుమారుడికి యాజమాన్య బాధ్యతలు అప్పగించి.. ‘గౌరవ’ పదవిలో మాత్రమే కొనసాగుతున్నానన్నారు. ప్రస్తుతం తనకు ఓ జీవిత భాగస్వామి దొరికనట్లు వెల్లడించారు. ఆమె పేరు షీనా అని ప్రకటించారు కేపీ సింగ్. తన మామయ్య స్థాపించిన డీఎల్‌ఎఫ్‌లో 1961లో కేపీ సింగ్ చేరారు. దాదాపు 5 దశాబ్దాలపాటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2020లో ఛైర్మన్‌గా పదవీవిరమణ చేశారు. సింగ్ ప్రస్తుత ఆస్తి 66 వేల కోట్ల రూపాయలు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!