చెత్త కుప్పలో డైమండ్‌ నెక్లెస్‌ !! విషయం తెలిసి మున్సిపల్‌ సిబ్బంది ??

|

Jul 24, 2024 | 7:22 PM

ఓ వ్యక్తి పొరపాటున చెత్త కుప్పలో పడేసిన డైమండ్‌ నెక్లెస్‌ను మున్సిపల్‌ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతడి తల్లి తన మనవరాలికి రూ.5 లక్షల ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చింది. అయితే, దేవరాజ్ ఖాళీ బాక్స్‌ అనుకొని పొరపాటున దాన్ని చెత్తలో పడేశాడు.

ఓ వ్యక్తి పొరపాటున చెత్త కుప్పలో పడేసిన డైమండ్‌ నెక్లెస్‌ను మున్సిపల్‌ సిబ్బంది భద్రంగా అతనికి అప్పగించారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నగరానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతడి తల్లి తన మనవరాలికి రూ.5 లక్షల ఖరీదైన వజ్రాల నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చింది. అయితే, దేవరాజ్ ఖాళీ బాక్స్‌ అనుకొని పొరపాటున దాన్ని చెత్తలో పడేశాడు. మున్సిపల్‌ సిబ్బంది రోజూలాగే చెత్తను తీసుకెళ్లిపోయారు. జరిగిన పొరపాటును గుర్తించిన దేవరాజ్ వెంటనే మున్సిపల్ సిబ్బందిని సంప్రదించారు. దీంతో చెత్త నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థ ఉర్బసెర్ సుమీత్ రంగంలోకి దిగింది. వారంతా సమీపంలోని చెత్తబుట్టల్లో వెతికారు. ఓ పూలదండకు చిక్కుకుని ఉన్న నెక్లెస్‌ను గుర్తించి దాన్ని యజమానికి అందజేశారు. తన తల్లి ఎంతో ప్రేమతో చేయించిన నగ తిరిగి దొరకడంతో దేవరాజ్‌ ఆనందానికి అవధుల్లేవు. ఎంతో శ్రమించి తన నగను వెతికి పెట్టిన మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఫిర్యాదు చేయగానే వారు వెంటనే స్పందించారని కొనియాడారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వింత శిశువు జననం.. దైవానుగ్రహం అంటున్న పేరెంట్స్‌

“దృశ్యం” సీన్‌ రిపీట్‌.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం

ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా

రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్

Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్‌