Cable Car: గాల్లో భక్తుల ప్రాణాలు.. కేబుల్ కార్లలో ప్రయణిస్తుండగా ఊహించని షాక్.. చివరకి..
మధ్యప్రదేశ్‌లో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్నాలో వర్షాల కారణంగా కేబుల్ కార్లు గాలి లోనే నిలిచిపోయాయి. దీంతో అందులో ఉన్న జనం రెండు గంటల సేపు నరకయాతన అనుభవించారు. దాదాపు 200 మంది భక్తులు కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు.
మధ్యప్రదేశ్‌లో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్నాలో వర్షాల కారణంగా కేబుల్ కార్లు గాలి లోనే నిలిచిపోయాయి. దీంతో అందులో ఉన్న జనం రెండు గంటల సేపు నరకయాతన అనుభవించారు. దాదాపు 200 మంది భక్తులు కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. కరెంట్ సరఫరా పునరుద్దరించిన తరువాత ప్రయాణికులు క్షేమంగా కిందకు దిగారు. మెహర్ పర్వతశ్రేణుల్లో ఉన్న శారదా మాత దర్శనం చేసుకొని వస్తుండగా భక్తులు రోప్‌వేపై ఉన్న కేబుల్ కార్లలో చిక్కుకుపోయారు. దాదాపు 28 కేబుల్ కార్లు రోప్‌వేపై నిలిచిపోయినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. కాగా ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం,ఈదురుగాలుల కారణంగానే కరెంట్ సరఫరా నిలిచిపోయిందని , అందుకే కేబుల్ కార్లు గాలిలో చిక్కుకున్నాయని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!