Police Mock Drill: ఆలయంలో చొరబడ్డ టెర్రరిస్ట్.. చెంప చెళ్ళుమనిపించిన భక్తుడు..!

Police Mock Drill: ఆలయంలో చొరబడ్డ టెర్రరిస్ట్.. చెంప చెళ్ళుమనిపించిన భక్తుడు..!

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 10:46 PM

మహారాష్ట్రలోని స్వామినారాయణ్ ఆలయంలోకి సడెన్‌గా ఓ టెర్రరిస్ట్ ఏంట్రీ ఇచ్చాడు. దీంతో అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం భయానకంగా మారింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆందోళనతో వణికిపోయారు. ఇదంతా చూసిన ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. టెర్రరిస్టు చేతిలో గన్ ఉన్నప్పటికీ వెరవకుండా నేరుగా వెళ్లి చెంప చెల్లుమనిపించాడు.

మహారాష్ట్రలోని స్వామినారాయణ్ ఆలయంలోకి సడెన్‌గా ఓ టెర్రరిస్ట్ ఏంట్రీ ఇచ్చాడు. దీంతో అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం భయానకంగా మారింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆందోళనతో వణికిపోయారు. ఇదంతా చూసిన ఓ భక్తుడికి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. టెర్రరిస్టు చేతిలో గన్ ఉన్నప్పటికీ వెరవకుండా నేరుగా వెళ్లి చెంప చెల్లుమనిపించాడు. ఈ హఠాత్ పరిణామంతో సదరు టెర్రరిస్ట్ షాక్ అయ్యాడు. చివరకు ఇదంతా పోలీసుల మాక్ డ్రిల్ అని తెలిసి భక్తులు నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధూలె సిటీలోని ప్రఖ్యాత స్వామినారాయణ్ టెంపుల్‌లో చోటుచేసుకుందీ ఘటన.. టెర్రర్ దాడుల సమయంలో ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయం తెలుసుకోవడంతో పాటు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. బ్లాక్ డ్రస్, చేతిలో గన్ తో ఓ టెర్రరిస్ట్ ఆలయంలోకి సడెన్‌గా అటాక్ చేశాడు. ఓ భక్తుడు మాత్రం పట్టరాని కోపంతో టెర్రరిస్టు చెంప చెల్లుమనిపించాడు. ఈ రియాక్షన్ తో టెర్రరిస్టు రూపంలో ఉన్న వ్యక్తి ఖంగుతిన్నాడు. ఇంతలో అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి భక్తుడిని ఆపారు. నల్ల దుస్తుల్లో ఉన్న వ్యక్తి నిజమైన టెర్రరిస్ట్ కాడని, ఇదంతా మాక్ డ్రిల్ అని సర్ధిచెప్పారు. దీంతో అప్పటి వరకు భయాందోళనకు గురైన భక్తులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 12, 2023 10:20 PM